Font Size
ఓబద్యా 1-2
Telugu Holy Bible: Easy-to-Read Version
ఓబద్యా 1-2
Telugu Holy Bible: Easy-to-Read Version
ఎదోముకు శిక్ష
1 ఇది ఓబద్యాకు వచ్చిన దర్శనం. నా ప్రభువైన యెహోవా ఎదోమును[a] గురించి ఈ విషయం చెప్పాడు:
దేవుడైన యెహోవా నుండి ఒక సమాచారం మేము విన్నాము.
వివిధ దేశాలకు ఒక దూత పంపబడ్డాడు.
“మనం వెళ్లి ఎదోము మీద యుద్ధం చేద్దాం” అని అతడన్నాడు.
ఎదోముతో యెహోవా మాట్లాడటం
2 “చూడు, సాటి దేశాలలో నిన్ను అల్పునిగా చేస్తాను.
ప్రజలు నిన్ను మిక్కిలి అసహ్యించుకుంటారు.
Footnotes
- 1:1 40 ఎదోము యూదారాజ్యానికి ఆగ్నేయంగా ఉన్న దేశం. ఎదోము ప్రజలు ఏశావు సంతతివారు. యాకోబు కవల సోదరుడే ఏశావు. వారు ఇశ్రాయేలీయులకు శత్రువులు.
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
© 1997 Bible League International